రాష్ట్రంలో మంగళవారం తీవ్రమైన ఎండ .వేడి.వాతావరం కొనసాగాయి
విశాఖపట్నం, 16 జూలై (హి.స.) , :రాష్ట్రంలో మంగళవారం తీవ్రమైన ఎండ, వేడి వాతావరణం కొనసాగాయి. మధ్యాహ్నం సమయంలో వడగాడ్పులు వీచాయి. నరసాపురంలో అత్యధికంగా 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం కూడా కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వేడి వాతావరణం కొనసాగ
రాష్ట్రంలో మంగళవారం తీవ్రమైన ఎండ .వేడి.వాతావరం కొనసాగాయి


విశాఖపట్నం, 16 జూలై (హి.స.)

, :రాష్ట్రంలో మంగళవారం తీవ్రమైన ఎండ, వేడి వాతావరణం కొనసాగాయి. మధ్యాహ్నం సమయంలో వడగాడ్పులు వీచాయి. నరసాపురంలో అత్యధికంగా 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం కూడా కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వేడి వాతావరణం కొనసాగనుంది. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరోజు నుంచి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 17 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో, 18 నుంచి ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande