జగిత్యాల, 16 జూలై (హి.స.)
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హెల్త్ సబ్సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్, సిరిపూర్, సాతారం గ్రామాల్లో సంబదిత నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఏవైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించుకోవాలని సూచించారు. హెల్త్ సబ్సెంటర్ భవనాలు, జీపీ భవనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబదిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే సాతారం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి పరిసర ప్రాంతలను పరిశీలించి విద్యార్థులు, ఉపాద్యాయులతో మాట్లాడారు.
ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..