హైదరాబాద్, 16 జూలై (హి.స.)
ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్కు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లను, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సగం (50%) సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో పాల్గొనదల్చుకున్న విద్యార్థులు, ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ వర్సిటీ వెబ్సైట్లో tsmedadm.tsche.in) (https://వెబ్సైట్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్ సమయంలో కులం, స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్లను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని పేర్కొంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం రాష్ట్ర విద్యార్థుల జాబితాతో మెరిట్ లిస్ట్ విడుదల చేసి, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..