డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
హైదరాబాద్, 16 జూలై (హి.స.) అంబర్పేట నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లాన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్లోని వడ్డెర బస్తీలో రూ.14 లక్షల
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్


హైదరాబాద్, 16 జూలై (హి.స.)

అంబర్పేట నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైప్లాన్లు నేటి జనాభా అవసరాలకు సరిపోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్లోని వడ్డెర బస్తీలో రూ.14 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లాన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను ప్రధానంగా వేధిస్తున్న మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారంతోపాటు రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆయా ప్రాంతాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా అంచనాలు రూపొందించి ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande