తెలంగాణ, పెద్దపల్లి. 16 జూలై (హి.స.)
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు సభాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పొదుపు సంఘాల చెక్కులను మంత్రులు అందజేశారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఒక్క బొట్టు కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడమన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ని అసలు ఒప్పుకునేదే లేదని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కట్టి.. నీళ్లు ఎక్కడికి తీసుకుపోయారో చూసాము.. పక్కనే ఉన్న గోదావరి నీళ్లను ఇక్కడి ప్రజలకి అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు