కోహెడలో రేపు స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించనున్న గవర్నర్
తెలంగాణ, హుస్నాబాద్. 16 జూలై (హి.స.) హుస్నాబాద్ నియోజవర్గంలో స్థానిక శాసన సభ్యులు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజవర్గంను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి తన తండ్రి పేరిట పొన్నం స
స్టీల్ బ్యాంక్


తెలంగాణ, హుస్నాబాద్. 16 జూలై (హి.స.)

హుస్నాబాద్ నియోజవర్గంలో స్థానిక

శాసన సభ్యులు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజవర్గంను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి తన తండ్రి పేరిట పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో 2.5 కోట్ల రూపాయలతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. స్టీల్ బ్యాంక్ ద్వారా పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో స్టీల్ వస్తువుల వినియోగం పెంచి ప్లాస్టిక్ ను తగ్గించేలా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా గ్రామగ్రామాన అధికారులు అవగాహన కల్పించారు. ఈ స్టీల్ బ్యాంక్ ను గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో లాంఛనంగా తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 164 గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వీటి నిర్వహణ కొనసాగించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande