పార్కులను ఆక్రమిస్తే చర్యలు తప్పవు.. మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
హైదరాబాద్, 16 జూలై (హి.స.) పార్కులను ఆక్రమిస్తే చర్యలు తప్పవని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు కమ్మగూడ జార్జ్ వెంచర్ కాలనీలో పార్కు స్థలంలో వేసిన రోడ్డును మున్సిపల్ అధికారులు కూల్
మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక


హైదరాబాద్, 16 జూలై (హి.స.)

పార్కులను ఆక్రమిస్తే చర్యలు తప్పవని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు కమ్మగూడ జార్జ్ వెంచర్ కాలనీలో పార్కు స్థలంలో వేసిన రోడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తుర్కయంజాల్లో పార్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ఖాళీగా ఉన్న పార్క్ స్థలాలలో ఫెన్సింగ్ నిర్మించి పూల మొక్కలు నాటుతామని తెలిపారు. పార్కులను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ బిక్షపతి, ఏఈ చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సిబ్బంది శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande