అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే తలసాని
హైదరాబాద్, 16 జూలై (హి.స.) అర్హులైన పేద ప్రజలంతా తమకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడుపల్లిలోని తన కార్యాలయంలో ఆయన బాలానగర్ తహసీల్దార్ కార
ఎమ్మెల్యే తలసాని


హైదరాబాద్, 16 జూలై (హి.స.)

అర్హులైన పేద ప్రజలంతా తమకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడుపల్లిలోని తన కార్యాలయంలో ఆయన బాలానగర్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని సనత్ నగర్ డివిజన్కు చెందిన 12 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

10 మంది షాదీ ముబారక చెక్కులను, ఇద్దరు కళ్యాణలక్ష్మి చెక్కులను అందుకున్నారు. ఆడపడుచుల పెండ్లి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారంతో కూడుకున్నదని అన్నారు. వారికి కొంత చేయూత అందించి ఆదుకోవాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.లబ్ధిపొందిన వారు అర్హులైన ఇతరులు కూడా పథకాలను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని తలసాని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande