తెలంగాణ, ఆదిలాబాద్. 16 జూలై (హి.స.)
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఓ ఫైనాన్స్ సంస్థ మోసానికి పాల్పడింది. ఆదిలాబాద్ పట్టణంలోని జాదవ్ కృష్ణ అనే వ్యక్తి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించారు. తమ కార్యాలయంతో పాటు ఫైనాన్స్ ఇవ్వడం వసూలు చేయడం లాంటి ఉద్యోగాలు ఇస్తామంటూ ఒక్కొక్కరు వద్ద నుంచి రూ. 20వేలు వసూలు చేశారు.
జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూర్ ప్రాంతంలో దాదాపు 300 మంది నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. నెలరోజులుగా రేపు మాపు ఉద్యోగం అంటూ డబ్బులు ఇచ్చిన వారిని మభ్యపెడుతూ వచ్చారు. బుధవారం కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో అక్కడికి చేరుకున్నవారు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు జాదవ్ కృష్ణ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు