గండికోట, 16 జూలై (హి.స.)
: కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో విద్యార్థిని హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. విద్యార్థిని హత్యలో ప్రియుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ‘‘అమ్మాయిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదు. విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి బుధవారం ఉదయం కొన్ని కచ్చితమైన ఆధారాలు లభించాయి. వాటి గురించి ఇప్పుడే చెప్పలేం. ఇవాళ రాత్రిలోపు జిల్లా ఎస్పీ కేసును ఛేదిస్తారు’’అని డీఐజీ ప్రవీణ్ చెప్పారు.
ఎర్రగుంట్ల మండలానికి చెందిన బాలిక ప్రొద్దుటూరులో ఇంటర్ చదువుతోంది. సోమవారం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండికోటలో విద్యార్థిని మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మొదట ఆమె తన ప్రియుడు లోకేశ్‌తో గండికోట వచ్చినట్లు పోలీసులు భావించారు. కానీ, ఇందులో అతడి పాత్ర లేదని తేలింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ