న్యూఢిల్లీ, 16 జూలై (హి.స.)
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్యనున్న జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో శ్రమశక్తి భవన్లో ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ నిర్మించతలపెట్టిన పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్లలు, జలనవరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు సీఎంలు తమ అధికారిక నివాసాల్లో సీఎస్ లు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో గంటన్నరపాటు సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, లేవనెత్తాల్సిన ప్రశ్నలపై చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..