వచ్చే ఏడాది సంక్రాంతి.నాటికి పెండింగ్ టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు
అమరావతి, 16 జూలై (హి.స.) విజయనగరం: వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పెండింగ్‌ టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని ఏపీ టిడ్కో ఛైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం చర్యల వల్లే టిడ్కో గృహ
వచ్చే ఏడాది సంక్రాంతి.నాటికి పెండింగ్ టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు


అమరావతి, 16 జూలై (హి.స.)

విజయనగరం: వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పెండింగ్‌ టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని ఏపీ టిడ్కో ఛైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం చర్యల వల్లే టిడ్కో గృహ సముదాయాల్లో సమస్యలు నెలకొన్నాయని చెప్పారు. రూపాయికే ఇల్లు ఇస్తామన్న వైకాపా.. మాట తప్పిందన్నారు. ‘‘బ్యాంకుల వాయిదాలు చెల్లించలేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రవేశాలు జరిగిన చోట మౌలిక వసతులు లేవు. వీటి పరిష్కారంపై దృష్టి సారించాం. సంబంధిత శాఖల అధికారులతో త్వరలో అమరావతిలో సమావేశం నిర్వహిస్తాం’’అని అజయ్‌కుమార్‌ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande