తెలంగాణ, నిజామాబాద్. 16 జూలై (హి.స.)
నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11.05 గంటలకు డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ కు చేరుకున్న గవర్నర్ కు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు కేఆర్. సురేష్ రెడ్డి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగియాన్ మావీ, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి తదితరులు గవర్నర్ కు సాదర స్వాగతం పలికారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు