తిరుమల, 16 జూలై (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్టోబరు నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు, ఆర్జిత సేవల కోటాను విడుదల చేసింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని... ఈ సందర్భంగా వివిధ సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.
అక్టోబరు కోటా ముఖ్యమైన తేదీలు మరియు వివరాలు:
ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టికెట్లు: జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి.
ఆర్జిత సేవా టికెట్లు (
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ): జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి.
ఎలక్ట్రానిక్ లక్కీ డిప్: ఆర్జిత సేవా టికెట్ల కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లను పొందాలి.
వసతి కోటా (తిరుమల, తిరుపతి): జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలయింది.
శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ కోటా: శ్రీవారి సేవ జూలై 27వ తేదీ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి.
శ్రీవాణి ట్రస్టు టికెట్లు: జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
వృద్ధులు, దివ్యాంగుల కోటా: జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతుంది.
వార్షిక బ్రహ్మోత్సవాలు: అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
సేవల రద్దు: బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. అక్టోబరు 11, 12 తేదీల్లో సుప్రభాతంతో సహా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. అలాగే, అక్టోబరు 3 నుంచి 13వ తేదీ వరకు వర్చువల్ సేవలు మరియు అంగప్రదక్షిణలు రద్దు చేయబడ్డాయి.
భక్తులు ఈ మార్పులను గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి