అమరావతి, 17 జూలై (హి.స.)
):‘నా మరణానికి నా భార్యే కారణం’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు.. నులకపేటకు చెందిన పోతురాజు బ్రహ్మయ్య(30) కు మంగళగిరికి చెందిన మోహన కౌసల్యతో గతేడాది ఆగస్టులో వివాహమైంది. ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున ్నారు. ఆషాఢం కావడంతో కౌసల్య పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో బ్రహ్మయ్య మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ముందు తన మృతికి భార్యే కారణమని సెల్ఫీ వీడియా తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ