మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సీతక్క
తెలంగాణ, ములుగు. 17 జూలై (హి.స.) మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యాచరణలు అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలల
మంత్రి సీతక్క


తెలంగాణ, ములుగు. 17 జూలై (హి.స.)

మహిళల ఆర్థిక స్వావలంబన

కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యాచరణలు అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదనపు సీఈఓ సర్ప్పి కట్యాయిని దేవి, జిల్లా కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఇందిరమ్మ కలను సాకారం చేసే దిశగా మహిళా సంఘాలను అన్ని విధాలుగా బలోపేతం చేస్తోంది, అని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande