అమరావతి, 17 జూలై (హి.స.)
పాకాల: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గిరి అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపాడు. ఈ ఘటన పాకాల మండలం మద్దినాయినిపల్లెలో చోటుచేసుకుంది. భార్య హేమకుమారి (35), కుమార్తెలు తేజశ్రీ (7), తనుశ్రీ (11)ని చంపేసిన తర్వాత గిరి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతోనే గిరి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీఐ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు. గిరిని ఆస్పత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ