నెల్లూరు జిల్లా రావూరు లో దారుణం ప్రియుడితో.కలిసి భార్య భర్తను హత్య చేసింది
రాపూరు, 17 జూలై (హి.స.) : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. భర్త శీనయ్యను భార్య ధనమ్మ కరెంట్‌ వైరుతో గొంతు బిగించి హతమార్చింది. ధనమ్మతో పాటు ప్రియుడు కల్యాణ్‌ను పోలీసులు అ
నెల్లూరు జిల్లా రావూరు లో దారుణం ప్రియుడితో.కలిసి భార్య భర్తను హత్య చేసింది


రాపూరు, 17 జూలై (హి.స.)

: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. భర్త శీనయ్యను భార్య ధనమ్మ కరెంట్‌ వైరుతో గొంతు బిగించి హతమార్చింది. ధనమ్మతో పాటు ప్రియుడు కల్యాణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ధనమ్మ స్వగ్రామం రాపూరు మండలం పంగిలి. వివాహం కాకముందునుంచే ఆమె కల్యాణ్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. వివాహం తర్వాత కూడా అది కొనసాగింది. ఈ క్రమంలో భర్తను వదిలించుకోవాలనుకున్న ఆమె.. పక్కా ప్లాన్‌ ప్రకారం.. ప్రియుడి సహకారంతో శీనయ్య మెడకు వైరు చుట్టేసి హత్య చేసింది. ఈఘటన బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గురువారం వెలుగులోకి వచ్చింది. శీనయ్య, ధనమ్మ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైనట్లు తెలుస్తోంది. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande