రాష్ట్రంలో పెట్టుబడులకు ఆ రెండు సంస్థలు సిద్ధం.. సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, 17 జూలై (హి.స.) తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పలు బహిరంగ వేదికలపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటచేసుకుంది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రమ
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 17 జూలై (హి.స.)

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పలు బహిరంగ వేదికలపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటచేసుకుంది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి ఇవాళ లేఖ రాశారు. రాష్ట్రంలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా తో పాటు ఎన్ఎల్సీ ఇండియా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. సౌర, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆ రెండు సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. అదేవిధంగా పంప్డ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యక్ష్యంగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande