హైదరాబాద్, 17 జూలై (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ కేసు లో విచారణను వేగవంతం చేశామని, త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసుల విషయంలో తాను అనవసర హడావుడి చేయబోనని అంటూ కానీ, కేంద్రం ఈ విషయంలో తలదూర్చుతూ అడ్డు పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.. తాము అధికారంలోకి వచ్చాకే అరెస్టులు చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. అందుకే కాళేశ్వరంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చెప్పుచేతల్లోనే ఉన్నాయి కాబట్టి పని సులువు అవుతుందనే భావనలో కిషన్ రెడ్డి ఉన్నారేమోనని కామెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్