ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రింగురోడ్డు .వెంబడి హైటెక్ సిటీ ఏర్పాటు
అమరావతి, 17 జూలై (హి.స.), : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రింగ్‌రోడ్డు వెంబడి హైటెక్‌ సిటీని ఏర్పాటుచేయాలని, దానిలో కృత్రిమమేధ (ఏఐ), సెమీ కండక్టర్లతో పాటు ఇతర హైటెక్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లు అభివృద్ధి చేయాలని ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్‌-2047 లక్ష్యసాధన దిశగా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రింగురోడ్డు .వెంబడి హైటెక్ సిటీ ఏర్పాటు


అమరావతి, 17 జూలై (హి.స.), : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రింగ్‌రోడ్డు వెంబడి హైటెక్‌ సిటీని ఏర్పాటుచేయాలని, దానిలో కృత్రిమమేధ (ఏఐ), సెమీ కండక్టర్లతో పాటు ఇతర హైటెక్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లు అభివృద్ధి చేయాలని ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్‌-2047 లక్ష్యసాధన దిశగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి’ అన్న అంశంపై దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలతో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు చేసింది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, డ్రోన్స్‌ రంగాల్లో ఏపీ ప్రత్యేకదృష్టి పెట్టాలని, దాని కోసం తిరుపతి జిల్లాలోని ‘శ్రీ సిటీ’ నమూనాను రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అమలుచేయాలని సూచించింది. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిల్లో సమీకృత ఐటీ పార్కులు, ఇంక్యుబేషన్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని, అభివృద్ధి, పరిశోధన (ఆర్‌ అండ్‌ డీ) వంటి నిర్దిష్టమైన విభాగాల్లో పనిచేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని సూచించింది. అమరావతి చుట్టుపక్కల మెడిసిటీని అభివృద్ధి చేయాలని సిఫారసు చేసింది. టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ కోఛైర్మన్‌గా ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ రూపొందించిన 360 పేజీల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో బుధవారం విడుదల చేశారు. వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ...

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande