హైదరాబాద్, 17 జూలై (హి.స.)
మాదాపూర్ సున్నం చెరువు వద్ద
హైడ్రా తీరుపై బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా చేపట్టిన చెరువు పునరుద్ధరణ పనులు నిలిపివేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. సియేట్ లేఔట్, మారుతి నగర్ వాసులు కళ్లకు గంతులు కట్టుకుని నిరసన చేపట్టారు. తమ ప్లాట్లలో హైడ్రా అధికారులు పనుల చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఎఫ్టిల్, బఫర్ జోన్ లను పూర్తి స్థాయిలో సర్వే చేపట్టే వరకు పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఓ వైపు సర్వే నడుస్తుండగానే మరోవైపు పక్కనే ఉన్న కాలనీల వారు ఆందోళనలు చేస్తుండడంతో సున్నం చెరువు అభివృద్ధి పనులకు ఆటంకాలు తప్పడం లేదు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..