తెలంగాణ, నారాయణపేట 17 జూలై (హి.స.)
ఉన్నోళ్లను దోచి పేదల కడుపు నింపిన మహానీయుడు పండుగ సాయన్న అని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కొనియాడారు. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి వేడుకలను ఇవాళ మక్తల్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం కాలంలోనే ఉన్న వాళ్లను దోచి పేదోళ్లకు పెంచిన బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ పండుగ సాయన్న అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు