విచార‌ణ‌కు రండి .. కేంద్ర మంత్రి బండికి సిట్ పిలుపు
హైదరాబాద్, 17 జూలై (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ కు సిట్ నుంచి పిలుపు వ‌చ్చింది.. త‌న ఫోన్ సైతం ట్యాపింగ్ కు గురైన‌ట్లు బండి పేర్కొన్న నేప‌థ్యంలో విచార‌ణ‌కు రావ
బండి సంజయ్


హైదరాబాద్, 17 జూలై (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ కు సిట్ నుంచి పిలుపు వ‌చ్చింది.. త‌న ఫోన్ సైతం ట్యాపింగ్ కు గురైన‌ట్లు బండి పేర్కొన్న నేప‌థ్యంలో విచార‌ణ‌కు రావాల్సిందిగా సిట్ నోటీస్ లు పంపింది.. ఈనెల 24వ తేదీన హైద‌రాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా కోరింది.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన స‌మాచారం, డాక్యుమెంట్స్, ఇత‌ర అధారాలు ఉన్న‌ట్ల‌యితే విచార‌ణ స‌మ‌యంలో అధికారుల‌కు అంద‌జేయ‌వ‌ల‌సిందిగా కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande