హైదరాబాద్, 17 జూలై (హి.స.) ఇటీవల దారుణ హత్యకు గురైన మెదక్ జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు మరెల్లి అనిల్ కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య పరామర్శించారు. అతని తండ్రి అనంతయ్య, తల్లి ఏసమ్మ, మృతుని భార్య శిరీష, సోదరుడు నవీన్ లతో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, మెదక్ డిఎస్పీలతో మాట్లాడారు.
అనిల్ ను చంపిన వ్యక్తులకు కఠినంగా శిక్షపడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తును వేగవంతం చేసి నింతులకు శిక్ష పడేలా చూడాలని అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..