Andhra Pradesh, 17 జూలై (హి.స.)
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతోన్న స్పెషల్ ట్రైన్లపై సౌత్ సెంట్రల్ రైల్వేస్ (South Central Railways) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 54 ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లుగా తెలిపింది. ఇందులో భాగంగా కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 స్పెఫల్ ట్రైన్లు, హైదరాబాద్-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్-కన్యాకుమారి (Hyderabad-Kanyakumari) మార్గంలో 07230/07239 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు సీపీఆర్వో శ్రీధర్ (CPRO Sridhar) తెలిపారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరికొన్ని మార్గాల్లో 38 స్పెషల్ సర్వీసులను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య 10, కాచిగూడ-నాగర్‌సోల్ మధ్య 8, నాందేడ్-తిరుపతి మధ్య 10, నాందేడ్-ధర్మవరం మధ్య 10 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి