నంద్యాల, 17 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu ) నంద్యాల జిల్లా (Nadyal) పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ నంద్యాల జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఇవాళ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఏపీకి వస్తారు. ఢిల్లీ నుంచి నేరుగా నంద్యాల పర్యటనకు వెళ్తారు. ఈ సందర్భంగా హంద్రీనీవా కాల్వకు నీరు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
వాస్తవంగా హంద్రీనీవా ఫేజ్ 1 కాల్వ విస్తరణ పనులు ఏకంగా 696 కోట్లతో ఏపీ సర్కార్ చేపట్టింది. ఈ నేపథ్యంలో కాల్వ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్కులకు పెరిగిపోయింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తిగా నింపబోతున్నారు. దీని ఫలితంగా రాయలసీమ జిల్లాలకు సాగు అలాగే మంచినీళ్లు సమస్య తీరనుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం నందికొట్కూరు మండలం అల్లూరులో మల్యాల వద్ద రెండు మోటర్లు ఆన్ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు రైతుల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి