బెంగళూరులో 40, ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు, 18 జూలై (హి.స.) దేశంలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతుంది. తను ముఖ్య నగరాలలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా బెంగళూరు లోని 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రాజరాజేశ్వరీ నగర్, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠ
బాంబు బెదిరింపులు


బెంగళూరు, 18 జూలై (హి.స.)

దేశంలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతుంది. తను ముఖ్య నగరాలలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా బెంగళూరు లోని 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రాజరాజేశ్వరీ నగర్, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో నగర పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ టీమ్ లు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో 20పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande