సుప్రీంకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మ.. దర్యాప్తు కమిటీ రిపోర్ట్‌పై పిటిషన్
న్యూఢిల్లీ: 18 జూలై (హి.స.)నోట్ల కట్ల వ్యవహారంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న తరుణంలో సుప్రీం ధర్మాసనాన్ని వర్మ ఆశ్రయించారు. తనపై సుప్
Supreme Court


న్యూఢిల్లీ: 18 జూలై (హి.స.)నోట్ల కట్ల వ్యవహారంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న తరుణంలో సుప్రీం ధర్మాసనాన్ని వర్మ ఆశ్రయించారు. తనపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదిక తప్పు అంటూ న్యాయస్థానంలో సవాల్ చేస్తూ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో న్యాయ సూత్రాలను పాటించలేదని ఆరోపించారు. తనను పూర్తిస్థాయిలో విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్‌ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande