న్యూఢిల్లీ ,18 జూలై (హి.స.) బీహార్, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివరిలో బీహార్.. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రధాని మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.
శుక్రవారం పశ్చిమబెంగాల్‌లో రూ.5,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ పట్టణంలో బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీలోనూ మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ బెంగాల్‌పై ఫోకస్ పెట్టారు.
పశ్చిమ బెంగాల్ పర్యటన తర్వాత బీహార్‌లోనూ మోడీ పర్యటించనున్నారు. రూ.7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నా రు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరీ పట్టణంలోని గాంధీ మైదాన్‌లో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. రూ.4,079 కోట్లతో పూర్తి చేసిన దర్భాంగా– నార్కాటియాగంజ్ 256 కిలోమీటర్ల రైల్వేలైన్ డబ్లింగ్‌ను మోడీ జాతికి అంకితం చేయనున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ