న్యూఢిల్లీ, 18 జూలై (హి.స.)
బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఎన్నికల చోర్ బ్రాండ్గా మారిందని కామెంట్ చేశారు. ఈసీ బహిరంగంగా బీజేపీకి అనుకూలంగా పక్షపాతంతో వ్యహరిస్తోందని ఫైర్ అయ్యారు. బీహార్ ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సవ్ రివిజన్ (సర్) పేరుతో దొంగ ఓట్లను వేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వేయిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో నిజమైన ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అదేవిధంగా హరియాణాలోని హిసార్లో దళిత యువకుడు గణేష్ వాల్మీకి హత్య, అతని కుటుంబంపై జరిగిన దాడి నేరం మాత్రమే కాదని.. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనువాద వ్యవస్థకు తార్కాణమని అన్నారు. భారతదేశంలో బహుజనుల జీవితాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. గణేష్ వాల్మీకీని పోలీసులే చంపేశారని, ఘటన జరిగి 9 రోజులు గడుస్తున్నా.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై దాడులకు నియంత్రణ లేకుండా పోయిందని రాహుల్ గాంధీ అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..