ఐదేళ్లలో 134 మంది నిందితులు స్వదేశానికి
దిల్లీ: 18 జూలై (హి.స.)భారత్‌లో నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిలో 134 మందిని గడిచిన ఐదేళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వదేశానికి రప్పించింది. 2010-2019 మధ్య కాలంతో కేవలం 74 మందిని మాత్రమే భారత్‌కు తీసుకువచ్చారని, 2020-2025 మధ్య ఈ సంఖ్
ఐదేళ్లలో 134 మంది నిందితులు స్వదేశానికి


దిల్లీ: 18 జూలై (హి.స.)భారత్‌లో నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిలో 134 మందిని గడిచిన ఐదేళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వదేశానికి రప్పించింది. 2010-2019 మధ్య కాలంతో కేవలం 74 మందిని మాత్రమే భారత్‌కు తీసుకువచ్చారని, 2020-2025 మధ్య ఈ సంఖ్య రెట్టింపు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 23 మంది నేరస్థులను దేశానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. సాంకేతిక పురోగతి, ఇంటర్‌పోల్‌తో సమన్వయం, ఇతర దేశాలతో అవగాహన కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. గడిచిన దశాబ్ద కాలంలో విదేశాలతో మన దౌత్యం గణనీయంగా మెరుగుపడినట్లు చెప్పారు. తాజాగా అమెరికాలో నేహాల్‌ మోదీ, మోనికా కపూర్‌ అరెస్టులు సీబీఐ విజయానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. 2024 డిసెంబరు నాటికి 65 మంది భారతీయ నేరస్థుల అప్పగింత అభ్యర్థనలు అమెరికాలో పెండింగులో ఉన్నాయి. భారత్‌ ఇప్పటివరకు 48 దేశాలతో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలపై సంతకాలు చేసిందిd

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande