న్యూఢిల్లీ: 18 జూలై (హి.స.)భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi)తో ఆయన భేటీ అయి ఇరుదేశాలకు సంబంధించిన విషయాల్లో తృతీయ పక్షం (పాక్‌ను ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.
గతేడాది అక్టోబరులో చైనాతో జరిగిన ఒప్పందం ప్రకారం డెస్పాంగ్, డెమ్‌చోక్‌లో భారత బలగాల పెట్రోలింగ్ పునరుద్ధరణపై జైశంకర్ సంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు స్థిరమైన సరిహద్దు కీలకమని ఈసందర్భంగా జై శంకర్ తెలిపారు. గల్వాన్ ఘర్షణ జరిగి ఐదేళ్లు గడిచిన నేపథ్యంలో ఇరుదేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంపై ప్రస్తుతం దృష్టి సారించాలన్నారు. ఈసందర్భంగా చైనా పొలిట్‌బ్యూరో సభ్యుడు వాంగ్‌తో ఇరుదేశాల మధ్య వస్తువుల సరఫరాలు సాఫీగా జరగాలని, ఎగుమతులపై ఎలాంటి పరిమితులు విధించకూడదని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ