రష్యా మహిళ కోసం ఇజ్రాయెల్‌ నుంచి ప్రియుడు రాక
న్యూఢిల్లీ: 18 జూలై (హి.స.)కర్ణాటక తీర పట్టణం గోకర్ణ సమీప అడవిలోని గుహలో రహస్యంగా నివసించిన రష్యా మహిళ నీనా కుటినా(40).. తన ప్రేయసి అని ఇజ్రాయెల్‌ నుంచి డ్రోర్‌ గోల్డ్‌ స్టెనిన్‌(38) అనే వ్యక్తి గురువారం బెంగళూరు వచ్చారు. ఆమెతో మాట్లాడేందుకు పోలీసుల
రష్యా మహిళ కోసం ఇజ్రాయెల్‌ నుంచి ప్రియుడు రాక


న్యూఢిల్లీ: 18 జూలై (హి.స.)కర్ణాటక తీర పట్టణం గోకర్ణ సమీప అడవిలోని గుహలో రహస్యంగా నివసించిన రష్యా మహిళ నీనా కుటినా(40).. తన ప్రేయసి అని ఇజ్రాయెల్‌ నుంచి డ్రోర్‌ గోల్డ్‌ స్టెనిన్‌(38) అనే వ్యక్తి గురువారం బెంగళూరు వచ్చారు. ఆమెతో మాట్లాడేందుకు పోలీసుల సాయం కోరారు. వారికి సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. ‘‘గోవాలో ఇద్దరం ఒకే కంపెనీలో పని చేశాం. అప్పుడే ప్రేమించుకున్నాం. ఇద్దరు కుమార్తెలు జన్మించిన అనంతరం కూడా కలిసే ఉన్నాం. గతేడాది పనిపై ఇజ్రాయెల్‌ వెళ్లా. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. ఉన్నట్లుండి మార్చి నుంచి నీనా ఫోన్‌కు స్పందించడం మానేశారు. ఈ విషయంపై పణజీ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశా. ఇటీవల గుహలో రహస్యంగా ఉన్న ఆమెను, పిల్లల్ని పోలీసులు రక్షించారని తెలిసి.. వెంటనే ఇక్కడికి వచ్చా’ అని పోలీసులకు వివరించారు. కుటుంబ నిర్వహణకు ప్రతి నెలా రూ.3.5 లక్షలు పంపుతున్నానని తెలిపారు. ఆమె తరచూ ప్రకృతి మధ్యలోనే పిల్లలను పెంచాలనేదని.. అందుకే అడవిలోకి వెళ్లి ఉండొచ్చని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande