పృథ్వీ-2, అగ్ని-1 టెస్ట్ ఫైరింగ్ సక్సెస్
చాందీపూర్‌, 18 జూలై (హి.స.)పృథ్వీ-2, అగ్ని-1 బాలిస్టిక్ మిసైల్స్‌ ప్రయోగం విజయవంతమైనట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ మిసైల్స్ ప్రయోగం జరిగినట్లు రక్షణ శాఖ తెలిపింది. ‘షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మ
పృథ్వీ-2, అగ్ని-1 టెస్ట్ ఫైరింగ్ సక్సెస్


చాందీపూర్‌, 18 జూలై (హి.స.)పృథ్వీ-2, అగ్ని-1 బాలిస్టిక్ మిసైల్స్‌ ప్రయోగం విజయవంతమైనట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ మిసైల్స్ ప్రయోగం జరిగినట్లు రక్షణ శాఖ తెలిపింది. ‘షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు పృథ్వీ-2, అగ్ని-1 రెండింటినీ విజయవంతంగా టెస్ట్ ఫైర్ చేశాం’ అని రక్షణ శాఖ ప్రకటిచింది. ఈ ప్రయోగంలో అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పరామితులను విజయవంతంగా అందుకుందని తెలిపింది. దీంతో భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో రెండు శక్తిమంతమైన ఆయుధాలు చేరినట్లయిందని నిపుణులు అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande