హైదరాబాద్, 23 జూలై (హి.స.) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
బీజేపీ పార్టీకి రాజీనామాపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజా భాయ్ పార్టీ సభ్యత్వం కోసం ఒక్క మిస్డ్కాల్ ఇస్తే చాలన్నారు. రాజా బాయ్ సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని తెలిపారు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రాజాసింగ్ రిజైన్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంకు సూచించారు. ప్రతిఒక్కరికి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని ఎంపీ ధర్మపురి చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. 'రాజాసింగ్ ఎక్కడున్నా మేము గౌరవిస్తాం. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్. రాజా బాయ్ సస్పెండ్ కాలేదు, రిజైన్ చేశారు. రాజాసింగ్ పార్టీ సభ్యత్వం కోసం ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకొచ్చు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రిజైన్ చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి. పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. కార్యకర్తలు, నాయకులు అయ్యే సమయం ఇది. ఇందూర్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మేం గెలుస్తున్నాం. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలు. ప్రతి నాయకులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి' అని ఎంపీ ధర్మపురి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్