అమరావతి, 23 జూలై (హి.స.)
అన్నవరం: అన్నవరం ఆలయంలో పారిశుద్ధ్య నిర్వహణ కార్మికులకు భవిష్యనిధి(ఈపీఎఫ్) చెల్లింపుల్లో నకిలీ చలానాలతో మోసానికి పాల్పడిన గుత్తేదారు కనకదుర్గ మ్యాన్‌పవర్ సర్వీసెస్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు దేవస్థానం అధికారులు మంగళవారం ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ