దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ డిమాండ్..
హైదరాబాద్/ఢిల్లీ ,23 జూలై (హి.స.)జగదీప్‌ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చే
Revanth


హైదరాబాద్/ఢిల్లీ ,23 జూలై (హి.స.)జగదీప్‌ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగదీప్ ధన్కడ్ రాజీనామా బాధాకరమన్నారు. ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న వెంకయ్య నాయుడును వెనక్కి పంపించారన్నారు. ఎన్డీయే తెలంగాణలో ఉన్న బీసీలకు అన్యాయం చేసిందని.. ఎన్డీఏ దత్తాత్రేయ, బండి సంజయ్ ల గొంతు కోసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande