ఇది మునిగిపోతున్న ప‌డ‌వ కాదు – ఆనాడు అన్న‌వారికి ఈ రోజు స‌మాధానం -డిప్యూటీ సిఎం భట్టి
హైదరాబాద్, 23 జూలై (హి.స.) తాము మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్రారంభించిన‌ప్పుడు మునిగిపోతున్న ప‌డ‌వ ఎందుకు ఎక్కుతార‌ని ప్ర‌తిప‌క్షాలు అన్నాయ‌ని, మునిగిపోతున్న ప‌డ‌వ కాదు అని ఈ రోజు బ‌దులిచ్చామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ‘200 కోట్ల మహిళా ఉచ
డిప్యూటీ సిఎం భట్టి


హైదరాబాద్, 23 జూలై (హి.స.)

తాము మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్రారంభించిన‌ప్పుడు మునిగిపోతున్న ప‌డ‌వ ఎందుకు ఎక్కుతార‌ని ప్ర‌తిప‌క్షాలు అన్నాయ‌ని, మునిగిపోతున్న ప‌డ‌వ కాదు అని ఈ రోజు బ‌దులిచ్చామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ‘200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పండగ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. 200 కోట్ల ఉచిత మహిళా ప్రయాణికులు 6680 కోట్లు ఆదా చేసుకున్నారు వారికి శుభాకాంక్షలు.. భవిష్యత్తులో కూడా మీ చార్జీలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంద‌న్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande