హైదరాబాద్లో 9మంది డ్రగ్స్ పెడ్లర్ల అరెస్ట్
హైదరాబాద్, 23 జూలై (హి.స.) హైదరాబాద్లో 9మంది డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు విదేశీయులు సైతం ఉండగా ఒక సాఫ్ట్
డ్రగ్స్


హైదరాబాద్, 23 జూలై (హి.స.)

హైదరాబాద్లో 9మంది డ్రగ్స్ పెడ్లర్లు

అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు విదేశీయులు సైతం ఉండగా ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్నాడు. నిందితుల్లో 7 గురు నైజీరియన్లు కాగా మిగిలిన ఇద్దరిని భారతీయులుగా గుర్తించారు.

వారి వద్ద నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ను అనేక పేర్లతో అమ్ముతున్నట్టు గుర్తించారు. అంతే కాకుండా వారివద్ద నుండి మారణాయుధాలు, 8 మొబైల్ ఫోన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నింధితులకు ముంబైతో లింకులు ఉన్నట్టు గుర్తించారు. కాటేదాన్ ప్రాంతానికి చెందిన రాజస్థాన్ వాసి జితేందర్ అలియాస్ జిత్తు, మరో వ్యక్తితో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. నగరంలో ఈ ముఠా పలువురికి డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande