హైదరాబాద్, 23 జూలై (హి.స.)
సింగూర్ ప్రాజెక్ట్ నుండి ఘనపూర్ ఆనకట్టకు ప్రతి సంవత్సరం రావాల్సిన 4.06 టీఎంసీ నీటిని నిబంధనల ప్రకారం విడుదల చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్టోళ్ల శశిధర్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కోరారు.
ఈ మేరకు ఆయన హైదరాబాద్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ నీటిని విడతల వారీగా విడుదల చేయాలన్నారు. ఇప్పటికే జూలై మాసం పూర్తికావస్తుందని, వేసినటువంటి నారుమడులు అన్ని ఎండిపోకుండా తక్షణమే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి 0.5 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కోరినట్లు ఈ సందర్భంగా పట్టోళ్ల శశిధర్ రెడ్డి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్