ప్రతి మండల కేంద్రంలో మండల సమైక్య భవనం : మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణ, మెదక్. 23 జూలై (హి.స.) అందోల్ నియోజకవర్గంలో ప్రతి మండలానికి అన్ని సౌకర్యాలతో సమైక్య‌ భవనాల నిర్మాణం చేపడతామని, ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట వీటిని నిర్మిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం చౌటకూర్ మండల
మంత్రి దామోదర


తెలంగాణ, మెదక్. 23 జూలై (హి.స.)

అందోల్ నియోజకవర్గంలో ప్రతి మండలానికి అన్ని సౌకర్యాలతో సమైక్య‌ భవనాల నిర్మాణం చేపడతామని, ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట వీటిని నిర్మిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం చౌటకూర్ మండల పరిధి లో నిర్వహించిన అందోల్ నియోజక వర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.మహిళా శక్తిని గుర్తించేందుకే ఈ విజయోత్సవాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్య‌మ‌న్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రభుత్వం రూ.6680 కోట్లు ఖర్చు చేసింద‌న్నారు. జిల్లాలో రూ.972 కోట్ల డ్వాక్రా రుణాలు అందించామని, 5లక్షల స్కూల్ యూనిఫామ్స్ డ్వాక్రా మహిళలతో తయారు చేయించి విద్యార్థులకు అందించామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు తీసుకువచ్చిన ఘనత ఆనాడు, ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానిదేన‌న్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande