చెన్నూరులో మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు..
తెలంగాణ, మంచిర్యాల. 23 జూలై (హి.స.) మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో గoడి మైసమ్మ ఆలయం లో రాష్ట్ర కార్మిక ఉపాధి, శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక జేబీఎస్ పాఠశాల ముందుగల గoడిమైసమ్మ ఆలయంలో ని
మంత్రి వివేక్


తెలంగాణ, మంచిర్యాల. 23 జూలై (హి.స.) మంచిర్యాల జిల్లాలోని

చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో గoడి మైసమ్మ ఆలయం లో రాష్ట్ర కార్మిక ఉపాధి, శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక జేబీఎస్ పాఠశాల ముందుగల గoడిమైసమ్మ ఆలయంలో నిర్వాహకులు, భక్తులు నూతన మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు మంత్రికి మేళతాళాలతో స్వాగతం పలికారు. ఆషాడ మాసం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున‌ భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande