అమరావతి, 23 జూలై (హి.స.)
నాయుడుపేట: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు అత్తను చంపాడు. నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్లుగా భార్యను కాపురానికి పంపడం లేదని అత్త చెంగమ్మ(47)పై అల్లుడు వెంకయ్య కక్షగట్టాడు. ఆత్మహత్యకు పాల్పడతానని ఆమెను ఫోన్‌లో బెదిరించాడు. ఈ క్రమంలో అత్తను అయ్యపరెడ్డిపాలేనికి రప్పించాడు. అక్కడ ఆమెతో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నదీ తీరంలో పూడ్చిపెట్టాడు. గ్రామస్థులు, బంధువులు నిలదీయడంతో నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. దీంతో వెంకయ్యను గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. దీనిపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ