విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
తెలంగాణ, మెదక్. 23 జూలై (హి.స.) హాస్టల్లోని విద్యార్థులకు తక్షణమే కాస్మోటిక్ చార్జీలను చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి


తెలంగాణ, మెదక్. 23 జూలై (హి.స.)

హాస్టల్లోని విద్యార్థులకు తక్షణమే కాస్మోటిక్ చార్జీలను చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ హాస్టల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డెన్లు వారి వారి హాస్టల్ లో గల సమస్యలను, ఇబ్బందులను ఎమ్మెల్యే ముందు ఏకరువు పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. హాస్టల్లో అన్ని సదుపాయాలు సక్రమంగా ఉంటేనే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సూచించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలను అందించాలని వార్డెన్లకు సూచించారు. కిచెన్లో మెనూకు సంబంధించిన చాట్ ను ఏర్పాటు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందివ్వాలని ఆదేశించారు. హాస్టల్లో డ్రైనేజ్, కాంపౌండ్ వాల్ తదితర సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande