హైదరాబాద్, 23 జూలై (హి.స.)
రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల
ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు BRSకు ప్రీ ఫైనల్స్ అని కామెంట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీ సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. తులం బంగారం, ఆడబిడ్డలకు స్కూటీలు నీటి మూటలుగానే మారాయని అన్నారు. రాష్ట్రంలో మెజారిటీ రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని, దీంతో వారు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటే స్థానిక ఎన్నికలే అత్యంత కీలకమని అన్నారు. ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోకల్ ఎలక్షన్లలో ప్రజలు కర్రకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని.. కానీ మంత్రులు తామేదో ఘనకార్యం చేశామని చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో తాము మళ్లీ అధికారంలోకి వచ్చి.. ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా సమన్యాయం చేస్తా కేటీఆర్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్