ఆర్డీవో కార్యాలయం ఆస్తుల జప్తు.. భూ పరిహారం కేసులో జిల్లా కోర్టు ఉత్తర్వులు
తెలంగాణ, ఆసిఫాబాద్. 23 జూలై (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సివిల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు రెండు కోట్ల 24 లక్షల భూ పరిహారం చెల్లింపులో జాప్యం వహించిన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆస్తుల జప్తుకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వా
ఆసిఫాబాద్ జిల్లా కోర్ట్


తెలంగాణ, ఆసిఫాబాద్. 23 జూలై (హి.స.)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

సివిల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు రెండు కోట్ల 24 లక్షల భూ పరిహారం చెల్లింపులో జాప్యం వహించిన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆస్తుల జప్తుకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాంకిడి మండలం బాంబర గ్రామ శివారులోని పెవుట చెరువు నిర్మాణం కోసం 2012లో స్థానిక రైతులను 70 ఎకరాల భూమిని ప్రభుత్వం భూ సేకరించింది. రైతులకు ఎకరానికి 80 వేల చొప్పున పరిహారం అందించారు. అయితే మార్కెట్ ధర కంటే తక్కువగా భూ పరిహారం చెల్లించారని 13 మంది రైతులు 2013లో ఆసిఫాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో వాదోపవాదాలు విన్న కోర్టు 2020లో బాధిత రైతులకు రెండు కోట్ల 24 లక్షల 58 వేల భూ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రైతులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆర్డీవో కార్యాలయం ఆస్తుల జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం కోర్టు సిబ్బంది కార్యాలయంలోని సామాగ్రిని జప్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande