తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం 23 జూలై (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం
ఏజెన్సీలోని చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకొని జలకళ సంతరించుకుంది. ఎగువనున్న ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరుకు వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు అధికారులు 15 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి, సుమారు 28,600 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీరు నిల్వకావడంతో, వరదనీటి ఉద్ధృతిని తగ్గించేందుకు నీటి విడుదల కొనసాగుతోంది. కురిసే వర్షాల ఆధారంగా మరింత వరద వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు