తెలంగాణ, వనపర్తి. 23 జూలై (హి.స.)
మహిళా సాధికారతే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యం పరిపాలిస్తుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు స్టాండ్ ఆవరణంలో నిర్వహించిన మహలక్ష్మి పథకం సంబరాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు. ఆర్టీసీ బస్సు లలో రెగ్యులర్ గా ప్రయాణిస్తున్న మహిళా, బాలికల ప్రయాణికులను ఎమ్మెల్యే సన్మానించారు. సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన మహాలక్ష్మి పథకం నష్టాలా లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలో ముందుకెళ్లేందుకు దోహదపడుతుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు