అమరావతి, 24 జూలై (హి.స.)
:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( అధ్యక్షతన ఇవాళ(గురువారం జులై24) ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశంజరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. వీటిని మనం వెంటబడి మరీ గ్రౌండ్ చేయించాలని సూచించారు. ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ